ఆంధ్రప్రదేశ్‌

బీమా రంగాన్ని ప్రైవేటీకరిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 21: దేశ ఆర్థిక రంగాన్ని పరిపుష్ఠి చేస్తున్న బీమా రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలు సహించేది లేదని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం(ఏఐఐఈఏ) ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఏఐఐఈఏ సిల్వర్ జూబ్లీ సమావేశాల నిమిత్తం విశాఖలో ఆదివారం జరిగిన రిసెప్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలన్నీ బీమా రంగాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రైవేటీకరించేలా తీసుకున్న నిర్ణయాలను సమైక్యంగా తిప్పికొట్టామని గుర్తు చేశారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అదే తీరును ప్రదర్శిస్తోందని ఆరోపించారు. బీమా రంగంలో నూరుశాతం నిధులు ప్రజలవేనని, దీనిపై జీఎస్టీ భారం మోపుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. బీమా సంస్థల్లో ప్రజాధనం దేశాభివృద్ధికి ఉపయోగపడుతోందన్నారు. బీమా రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతించడమంటే అంబానీలు, నీరవ్ మోదీలకు ఆర్థిక పగ్గాలు అప్పగించడమేనని మండిపడ్డారు. ప్రజల పెట్టుబడులను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటారని, తద్వారా ప్రజాధనం పరుల పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐఐఏఈ జాతీయ 25వ వార్షిక సమావేశాలు ఈసారి విశాఖలో నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి నాలుగు రోజుల పాటు విశాఖలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతాయని స్పష్టం చేశారు. జాతీయ కమిటీ సమావేశాలకు దేశ వ్యాప్తంగా అన్ని బీమా సంస్థల నుంచి సుమారు 2000 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. విశాఖలో జరిగిన సన్నాహక సమావేశానికి దక్షిణ భారత బీమా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దాస్, సంయుక్త కార్యదర్శి కిషోర్, సతీష్ పాల్గొన్నారు.