ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పెనుమల్లి మధు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టు కోసం రూ. 2100 కోట్లు అందించే ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంక్ విరమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. రాజధాని నిర్మాణంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం ఒత్తిడి తేవడం కీలకమన్నారు. ఇందుకు అవసరమైతే అందరినీ కలుపుకుని కృషి చేయాల్సి ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు చొరవ చూపాలని రామకృష్ణ, మధు కోరారు.