ఆంధ్రప్రదేశ్‌

కరవుపై చర్చకు మండలిలో పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: రాష్ట్ర శాసన మండలిలో కరవుపై చర్చకు టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యలో వెళ్లిపోగా, మంత్రి వెళ్లపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్ర శాసన మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో అనావృష్టి పీడిత ప్రాంతాల్లో రైతులకు సహాయక చర్యలపై వైకాపా సభ్యులు జంగా కృష్ణమూర్తి తదితరులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. కరవు వల్ల పంట నష్టం జరిగినట్లు సమాచారం లేదని, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. వైకాపా సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా చాలా మండలాల్లో కరవు నెలకొందని గుర్తు చేశారు. కేంద్రం విడుదల చేసిన ఇన్‌పుట్ రాయితీ 800 కోట్లు రైతులకు చేరలేదని, వివిధ పద్దుల కింద కూడా విడుదల చేసిన నిధులు సక్రమంగా పంపిణీ కాలేదని ఆరోపించారు. టీడీపీ సభ్యురాలు శమంతకమణి మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, ఎరువులు అందటం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకను కాపాడే విధానం ప్రభుత్వం వద్ద లేదని, ఎలా రైతులను ఆదుకుంటారో చెప్పాలన్నారు. ఈ ప్రశ్న, మరో ప్రశ్న కూడా కరవుకు సంబంధించిందే కనుక, కరవు గురించి చర్చించాలని కోరుతూ టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చారు. మండలి చైర్మన్ షరీఫ్ మాట్లడుతూ వేరే ఫార్మాట్‌లో వస్తే చర్చకు అనుమతిస్తామన్నారు. అయినప్పటికీ, టీడీపీ సభ్యులు చర్చ జరిగేందుకు వీలుగా మాట్లాడనివ్వాలని కోరారు. చైర్మన్ నిరాకరించడంతో టీడీపీ సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేశారు. కరవుపై జరిగే చర్చకు పరిమితి విధిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇది పద్ధతి కాదని, తమ స్థానాల్లో కూర్చుంటే అనుమతి ఇస్తామని చైర్మన్ చెప్పడంతో టీడీపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చున్నారు. మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కీలకమైన ఈ అంశంపై సమయం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. గతంలో వివిధ అంశాలపై ఇతర ఫార్మాట్‌లో ఇచ్చినవి ఆరు ఉన్నాయని గుర్తు చేశారు. దాదాపు 640 మండలాల్లో కరవు ఉందన్నారు. టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 55 రోజుల్లో 55 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దీనిపై చర్చకు అనుమతించాలన్నారు. కరవును ఎదుర్కొనేందుకు ప్రణాళిక ఏమిటని ప్రశ్నించారు. పీడీఎఫ్ సభ్యుడు వై.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రైతులు గౌరవం కోసం వ్యవసాయం చేస్తున్నారన్నారు. రైతులను ఆదుకోవాలన్నారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ, 330 మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందని, 140 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైందన్నారు. కరవు నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గతంలో క్షోభ అనువించడమే కారణమన్నారు. గతంలో వ్యవసాయం శుద్ధ దండగ అనే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పండగ అనేలా చేస్తున్నామన్నారు. దేవుడు కరుణిస్తాడని భావిస్తున్నామన్నారు. సమాధానం చెప్పాక మంత్రి సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై యనమల స్పందిస్తూ, తరువాతి ప్రశ్నను వాయిదా వేశారని, కరవు నివారణకు తీసుకున్న చర్యలు చెప్పాలి కదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బిజినెస్ ఉన్నప్పటికీ, మధ్యలో అలా వెళ్లిపోవడం సరికాదన్నారు. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని చైర్మన్ ప్రకటించాకే మంత్రి బొత్స వెళ్లారన్నారు. 43 శాతం మేర తక్కువ వర్షపాతం నమోదైందని, చర్చ అవసరమని, మంత్రిని వెనక్కి పిలవాలని యనమల కోరారు. తీవ్రమైన ఈ సమస్యపై మాట్లాడుకుండా వెళ్లిపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని, దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.