ఆంధ్రప్రదేశ్‌

పట్టణాల్లో వ్యర్థ జలాల రీసైక్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో పారిశుద్ధ్యం, వేస్ట్ వాటర్ రీ సైక్లింగ్, రిసోర్స్ రికవరీ అనే అంశంపై బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వ్యర్థ జలాల రీ సైక్లింగ్‌తో పాటు మెరుగైన పారిశుద్ధ్యంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కూడా పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, పారిశుద్ధ్యంపై ఆకస్తి చూపుతూ నివేదిక కోరిందన్నారు. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ప్రతిపాదించిన 71 ప్రాంతాల ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన చేపట్టి పట్టణాల సుందరీకరణకు తోడ్పడాలని కోరారు. ప్రాజెక్ట్‌కు తగిన స్థలాలను వచ్చేనెల 10వ తేదీలోగా స్వాధీనం చేసేందుకు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. వ్యర్థ జలాల రీ సైక్లింగ్‌కు సంబంధించి డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో ప్రభుత్వం ప్రారంభించనున్న గ్రామసచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ప్రాజెక్ట్‌కు ఉపకరిస్తాయని వివరించారు. సమావేశంలో ఫౌండేషన్ డైరెక్టర్ మధుకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.