ఆంధ్రప్రదేశ్‌

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: చంద్రయాన్-2 ప్రయోగం ఇస్రో చరిత్రలో మరో మైలురాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభివర్ణించారు. భారతీయ అంతరిక్ష పరిశోధనలో అద్భుత ఘట్టమన్నారు. ఉపగ్రహం వల్ల చంద్రునిపై ఆధ్యయనం చేసే వీలు కలుగుతుందన్నారు. ఇశ్రో శాస్తవ్రేత్తల కృషి భారత్ కీర్తి ప్రతిష్టలతో పాటు రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందని అభినందించారు.
చంద్రబాబు హర్షం
చంద్రయాన్-2 విజయవంతం కావటం పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తంచేశారు. విజయవంతంగా క్రయోజనిక్ దశ ముగించటంలో శాస్తవ్రేత్తల కృషి ప్రశంసనీయమన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో చంద్రయాన్-2 భారత ప్రతిష్టను పెంచిందన్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ఎం 1 ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావటం చరిత్రలో సువర్ణ్ధ్యాయంగా మిగులుతుందని అందుకు అహరహం శ్రమించిన శాస్తవ్రేత్తలను అభినందించారు. ఉపగ్రహాన్ని చంద్రుని దక్షిణ ధృవంలోకి ప్రవేశపెట్టటం సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. ఇస్రో నైపుణ్యం వల్లే వాటిని అధిగమించ గలిగిందన్నారు. దీని వల్ల చంద్ర గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులు, జాబిల్లి పుట్టుక, నీరు, ఇతర మూలాల గురించి తోలైన ఆధ్యయనం చేసే అవకాశం కలుగుతుందని ఆకాంక్షించారు.
మరపురాని క్షణాలు: పవన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంతో భారత్‌ను అగ్రరాజ్యాల సరసన నిలిపిందని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అభినందించారు. రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవటం శుభ పరిణామమన్నారు. ఈ మరుపురాని క్షణాలను ప్రతి భారతీయుడు సగర్వంగా గుర్తుంచుకుంటారని తెలిపారు. ఇస్రో శాస్తవ్రేత్తలకు జనసేన పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. పరిమిత వనరులతో చంద్రుడిపైకి రోవర్‌ను ప్రయోగించటం వల్ల మన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని ఇదో గొప్ప చారిత్రాత్మక ప్రయోగమని కీర్తించారు. ఇస్రో శాస్తవ్రేత్తలు అంతరిక్ష యానంలో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని అభిలషించారు.

చిత్రం... సీఎం జగన్