ఆంధ్రప్రదేశ్‌

హామీలపై ప్రశ్నిస్తే వేటు వేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 23: వైఎస్‌ఆర్ సీపీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక వారు చేస్తున్న పనులకు పొంతన లేదని రాష్ట్ర టీడీపీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకే తెలుగుదేశంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ముందుగా కళా వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్లు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని అసెంబ్లీలో ప్రశ్నించిన బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడిని బలవంతంగా సభ నుండి సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి అనుమతి మేరకు టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు. అసలు సీఎం కనుసన్నల్లో సభ నడవడమేంటని ప్రశ్నించారు. వెంటనే టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజల తరపున ప్రశ్నించే హక్కు ఉంటుందని గుర్తుచేశారు. వైసీపీ నాయకుల చేష్టలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, వారే సరైన సమయంలో బుద్ధిచెప్తారని కళా వెంకట్రావ్ హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య మాట్లాడుతూ శాసనసభలో సంఖ్యాబలాన్ని చూసుకుని జగన్ విర్రవీగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తున్న తీరు చూస్తుంటే అనైతిక సభ అనే భావన కలుగుతోందని, టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌తో సభ విశ్వసనీయత కోల్పోయిందన్నారుమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్డాలుతూ ఏపీ అసెంబ్లీ కక్షలు, కార్పణ్యాలకు నిలయంగా మారిందని, ప్రతిపక్ష సభ్యుల్ని అగౌరవపర్చడమ కాకుండా, ప్రజాపక్షాన మాట్లాడే వారి గొంతు నొక్కడం ప్రజాస్వామానికి పట్టిన దౌర్భాగ్యమంటూ అసహనం వ్యక్తంచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి ఎందరో మహానుభావుల్ని అందించిన శాసనసభ జగన్ లాంటి వ్యక్తుల్ని చూడాల్సి రావడం తెలుగుజాతి చేసుకున్న పాపమని మండిపడ్డారు. ప్రజల తరపున వారి సమస్యలు పరిష్కరించాలని కోరే ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆక్షేపించారు. తన 3,800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో 600కు పైగా సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు దేవుడు నాకు మంచి మనస్సు ఇచ్చాడని చెప్పుకునే జగన్ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తున్న సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆలపాటి ప్రశ్నించారు.