ఆంధ్రప్రదేశ్‌

కుటుంబ రాజకీయాలకు స్వస్తిపలకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 23: ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల ఇన్‌ఛార్జి సునీల్ వి దియోధర్ పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. సంఘటన పర్వ్ పేరుతో చేపడుతున్న సభ్యత్వ నమోదులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం విస్తారక్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడ కుల రాజకీయాలు, అవినీతి పాలనకు తోడు కుటుంబ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ మూడు సమస్యలను బీజేపీ పరిష్కరించి 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో విజయపతాకాన్ని ఎగరవేస్తుందని క్యాడర్‌కు ధీమానిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది ప్రత్యేక హోదా కాదని, అవినీతి పాలనను పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచన చేయాలని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్రానికి 90 శాతం నిధులు కేంద్రం విడుదల చేసిందని గుర్తుచేశారు. అయితే గత పాలకులు ప్యాకేజీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చేరువ కావాల్సిన ఎన్నో పథకాలకు దూరం చేశారని దుయ్యబట్టారు. అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తోందన్న విమర్శలు వినపడుతున్నాయని దియోధర్ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా భీమవరం పట్టణంలోని ఎస్సీ, బీసీ ఏరియాలో పర్యటించి వారికి బీజేపీ సభ్యత్వాలు అందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, జోనల్ ఇన్‌చార్జి దొమ్మరాజు సునీల్, పాకా సత్యనారాయణ, తపనా చౌదరి, ఓబీసీ అధ్యక్షులు కోమటి రవికుమార్, కాయిత సురేంద్ర పాల్గొన్నారు.