ఆంధ్రప్రదేశ్‌

లొంగిపోయన మావోయస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), జూలై 23: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో పలు విధ్వంసాలకు పాల్పడిన సీపీఐ మావోయిస్టులు విశాఖ ఎస్పీ ఎదుట మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, దళ సభ్యుడు ఒకరు, హార్డ్‌కోర్ మిలీషియా సభ్యులు నలుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరిపై రూ.4 లక్షల రివార్డు కూడా ఉంది. విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరాలు ప్రకటించారు. జీకే వీధి మండలం పెదకొండ గ్రామానికి చెందిన పాంగి తల్సో అలియాస్ లింబో (28) ప్రస్తుతం గాలికొండ ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేస్తోంది. అంతకు ముందు గాలికొండ, గుర్తేడు దళాల్లో పనిచేసింది. 2006 నుంచి వివిధ దళాల్లో పనిచేస్తూ పలు నేరాల్లో కీలక పాత్ర పోషించింది. ఈమెపై రూ.4 లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు.
జీకే వీధి మండలం పొందూరు గ్రామానికి చెందిన వంతల మంగమ్మ అలియాస్ జానకి (34) గాలికొండ, కోరుకొండ, గుర్తేడు దళాల్లో పనిచేసింది. 2011నుంచి 2102 వరకూ మిలీషియా మెంబర్‌గాను, 2013 నుంచి 2017 వరకూ దళ సభ్యురాలిగాను, 2017 నుంచి 2019 వరకూ ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేసింది. డిప్యూటీ కమాండర్‌గా పలకజీడి ఏరియాలో పనిచేసింది. ఈమెపై రూ.4 లక్షల రివార్డు ఉంది.
ముంచింగ్‌పుట్ మండలం, బూసిపుట్ట గ్రామానికి చెందిన కిల్లో రెల్లి అలియాస్ దుర్గా (34) గాలికొండ దళ సభ్యునిగా కొనసాగుతున్నారు. 2005 నుంచి దళంలో పనిచేస్తున్న దుర్గాపై రూ.లక్ష రివార్డు ఉంది. వీరితో పాటు పెదబయలు మండలం జుమడ గ్రామానికి చెందిన వంతల బాబూరావు (30), పెదబయలు మండలం ఇంజరి పంచాయతీకి చెందిన కొర్ర శివ (19), పెదబయలు మండలం ననుబారి గ్రామానికి చెందిన కొర్ర సుబ్బాలి, అలియాస్ సుందరి, అలియాస్ అలకనంద (19), జీ మాడుగుల మండలం తర్తాల్ గ్రామానికి చెందిన భూటారి నూకరాజు (38) పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాల్లో మార్పు, నాయకుల ఒంటెద్దు పోకడలు, అనారోగ్య సమస్యల కారణంగా తాము లొంగిపోతున్నామని విలేఖరుల ఎదుట వెల్లడించారు.
చిత్రం...లొంగిపోయిన మావోయిస్టు వివరాలు వెల్లడిస్తున్న డీఐజీ కేవీ రంగారావు, ఎస్పీ బాబూజీ అట్టాడ