ఆంధ్రప్రదేశ్‌

ప.గో.లో డెంగ్యూ లక్షణాలతో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి/పెరవలి, ఆగస్టు 16: పశ్చిమ గోదావరి జిల్లాలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతిచెందారు. దీనితో ప్రజల్లో కలవరం వ్యక్తమవుతోంది. అయితే ఇవి డెంగ్యూ మరణాలు కావని వైద్యాధికార్లు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో శ్రీకాంత్ (18) అనే యువకుడు గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ సోమవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు. రక్త పరీక్షల సందర్భంగా శ్రీకాంత్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్టు వెల్లడయ్యిందని మృతుని బంధువులు తెలిపారు. అలాగే పెరవలి మండలంలోని పిట్టల వేమవరంలో కొవ్వూరి తేజస్వీబిందు (15) అనే బాలిక జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది. వారం రోజుల క్రితం జ్వరం సోకడంతో తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు వున్నట్టు ప్రైవేటు వైద్యులు తెలిపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ రెండు మరణాలు డెంగ్యూ వాధి కారణంగా సంభవించలేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.