ఆంధ్రప్రదేశ్‌

సమన్వయంతో రాణించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 17: కృష్ణా పుష్కరాల నిర్వహణను సవాల్‌గా తీసుకుని సమస్యలు అధిగమించామని రాష్ట్ర హోం, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డిజిపి నండూరి సాంబశివరావులు అన్నారు. పౌర్ణమి సందర్భంగా గురువారం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి అవకాశం ఉందని, అదేవిధంగా 21వ తేదీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా ఉందన్నారు. దీంతో అధికార, భద్రతా యంత్రాంగం మరింత కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు కూడా పెరిగే అవకాశమున్నందున మెరైన్ పోలీసింగ్ వ్యవస్థను అప్రమత్తం చేశామన్నారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన ఆరు రోజులు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో తమ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ఆరురోజులు కూడా కొనసాగిస్తామని ఏర్పాట్లు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రధానంగా పోలీసుశాఖ సమస్యలను అధిగమించి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులకు పోలీసు సహాయ సహకారాలు ఉన్నాయని, ఘాట్లలో ప్రత్యేకంగా హోంగార్డులు అందించే సేవలు అభినందనీయమన్నారు. అదేవిధంగా భక్తులకు ఉచిత బస్సు సేవలు ఉన్నవిధంగానే కొనసాగిస్తామని నేరుగా వారిని ఘాట్ల వరకు తీసుకెళ్లడం జరుగుతుందని, అయితే 18వ తేదీ పౌర్ణమి సందర్భంగా రద్దీ ఎక్కువయితే పరిస్ధితిని బట్టి బస్సుల రాకపోకలపై స్వల్పకాల నియంత్రణ ఉంటుందన్నారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ విషయానికొస్తే.. మామూలు రోజుల్లో కంటే ఇప్పుడు రహదారులన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయని, ట్రాఫిక్ క్రమబద్దీకరణ సమర్ధవంతంగా నిర్వహించడంతోపాటు ఘాట్ల మాదిరిగానే పుష్కరనగర్‌ల నిర్వహణ బాగుందన్నారు. మూడు జిల్లాలో కలిపి 32వేల మంది పోలీసుబలగాలు సమర్ధ విధులు నిర్వహిస్తున్నాయని, ఆరోరోజు బుధవారం మధ్యాహ్నాం 2 గంటల సమయానికి 171 ఘాట్లలో 74లక్షల మంది భక్తులు స్నానమాచరించారని మంత్రి చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో పౌర్ణమి సందర్భంగా స్నానాలకు తరలివచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకుని మెరైన్ పోలీసింగ్‌ను అప్రమత్తం చేసి అక్కడ కూడా సహాయక, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. జగ్గయ్యపేట ముక్త్యాల ఘాట్‌లో వరుణ్‌కుమార్ అనే ఎనిమిదేళ్ల బాలుడు స్నానం చేస్తూ మునిగిపోతుండగా.. అక్కడే విధుల్లో ఉన్న ఎర్రస్వామి అనే కానిస్టేబుల్ అప్రమత్తమై బాలుడిని ప్రాణాలతో కాపాడాడని ఉదహరించిన డిజిపి పోలీసు సేవలను వివరించారు. పుష్కరాలు చివరికి వరకూ ఇదేరీతిలో పటిష్ట భద్రతా చర్యలు, సౌకర్యవంతమైన ఏర్పాట్లు కొనసాగుతాయని చెప్పారు. విలేఖరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, అదనపు డిజిపిలు ఆర్‌పి ఠాకూర్, ఎన్‌వి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూన్న హోంమంత్రి రాజప్ప, డిజిపి నండూరి