ఆంధ్రప్రదేశ్‌

శివగిరిలో శివోహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 17: శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునులు కొలవైన శిరి గిరులు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరం, శ్రీశైలంలో భక్తుల పుణ్యస్నానాల పరంపర కొనసాగుతోంది. రెండు పుణ్య క్షేత్రాల్లో బుధవారం 75 వేల మంది పుష్కర స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. శ్రీశైలంలో సుమారు 45 వేల మంది, సంగమేశ్వరంలో 23 వేలు, నెహ్రూనగర్‌లో 4 వేలు, ముచ్చుమర్రిలో 3 వేల మంది పుష్కర స్నానమాచరించారని అధికారులు ప్రకటించారు. పుష్కరాలు 12రోజులు కొనసాగుతున్నందున భక్తుల రాక క్రమబద్దంగా కనిపిస్తోంది. పుష్కర ఘాట్లలోనే కాకుండా ఆలయ దర్శనం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా సాగుతోంది. శ్రీశైలం, సంగమేశ్వరంలో భక్తులు కృష్ణాజలాల్లో ఆనందోత్సాహాల మధ్య మునిగి తేలుతున్నారు. శ్రీశైలంలో పుష్కర స్నానం చేసిన భక్తుల్లో అధికులు పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు. శ్రీశైలం ఆలయంలో సాధారణ భక్తులు సైతం కేవలం రెండు గంటల వ్యవధిలో స్వామి, అమ్మ వార్లను దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. దీంతో శ్రీశైలం పరిసరాల్లోని సాక్షి గణపతి, హఠకేశ్వరం, పాలదార, పంచదార, ప్రాజెక్టు ప్రాంతాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. సంగమేశ్వరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత శ్రీ లలితాసంగమేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఆ తరువాత సమీపంలోని దేశంలోనే మూడవ సరస్వతీ క్షేత్రం కొలనుభారతి ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు.
చివరి రోజున 1116 కలశాలతో జలాభిషేకం
పుష్కరాల సందర్భంగా తాము ఊహించిన దాని కంటే భక్తుల సహకారం ఎక్కువగా ఉందని కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ స్పష్టం చేశారు. పుష్కర విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూ భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తుండటంతో కార్యక్రమం ఒడిదుడుకులు లేకుండా సాగుతోందని తెలిపారు. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు పుష్కరఘాట్లను ఎస్పీ రవికృష్ణతో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. పుష్కరోత్సవాల సందర్భంగా చివరి రోజైన 23వ తేదీ 1116 మంది దంపతులతో శ్రీశైల మల్లికార్జునుడికి పుష్కర జలాలను కలశాలతో పాతాళగంగ నుంచి తీసుకొచ్చి జలాభిషేకం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం శ్రీశైలంలో స్వచ్ఛత కోసం ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్తాతో కలిసి ఆలయ వీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చేసిన ఏర్పాట్ల కారణంగా ప్రస్తుతం ఉన్న రద్దీకి రెట్టింపు వచ్చినా ఇబ్బందులు తలెత్తేవి కావన్నారు. ప్రధానంగా ప్రమాదకరమైన పాతాళగంగలోని రెండు పుష్కరఘాట్లపై ప్రత్యేక దృష్టి సారించి భద్రతను పటిష్టం చేశామని వెల్లడించారు. రోప్‌వేలో సాధారణ భక్తులను అనుమతించడమే కాకుండా భక్తుల కోరిక మేరకు వృద్ధులు, వికలాంగుల కోసం శ్రీశైలం నుంచి పాతాళగంగ వరకు వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

చిత్రాలు..సంగమేశ్వరం పుష్కరఘాట్‌లో భక్తుల రద్దీ
* శ్రీశైలంలో కలెక్టర్, ఎస్పీ, ఇవో సైకిల్ ర్యాలీ