ఆంధ్రప్రదేశ్‌

భారీగా డ్రగ్స్ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియన్‌కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, 5 గ్రాముల బ్రౌన్ షుగర్, రెండు ల్యాప్‌టాప్‌లు, 15 సెల్‌ఫోన్లు, ఒక ఐప్యాడ్, రూ. 33వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి వై లింబారెడ్డి తెలిపారు. బిజెనెస్ వీసాపై భారత్‌కు వచ్చిన వీరు గోవా నుంచి మాదక ద్రవ్యాలను ఒక గ్రాము రూ. 2వేల నుంచి 3వేల మధ్య కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని డ్రగ్స్ బానిసలకు గ్రాము రూ. 5వేల నుంచి 6వేల వరకు విక్రయిస్తున్నట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు డిసిపి తెలిపారు. నైజీరియన్ల నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ. 8లక్షలు ఉంటుందని డిసిపి లింబారెడ్డి వివరించారు.