ఆంధ్రప్రదేశ్‌

రైతు భరోసాకు వడబోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వడబోతతో రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గుతోంది. కేంద్రం చేపట్టిన వడపోతతో దాదాపు 10 లక్షల మేర లబ్ధిదారుల సంఖ్య తగ్గగా, రాష్ట్ర ప్రభుత్వం వడపోతలో దాదాపు 5.8 లక్షల మేర తగ్గడం గమనార్హం. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రారంభించగా, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది. కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్రం సంవత్సరానికి 6 వేల రూపాయలు ఇస్తుంది. ఏడాదికి మూడు విడతలుగా ఈ మొత్తాన్ని అందచేస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు బడ్జెట్‌లో ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించినప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి కిస్తు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం అమలుకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలతో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసింది. ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులు అర్హులుగా ప్రకటించింది. ఎన్నికల సమయం కావడంతో లబ్ధిదారుల వివరాలను పెద్దగా తనిఖీ చేయకుండా మొదటి కిస్తును రైతుల ఖాతాల్లో వేసింది. మొదటి కిస్తుకు అర్హులుగా ఎంపిక చేసిన రైతుల సంఖ్య 43.02 లక్షల మంది కాగా, రెండు వేల చొప్పున 42.5 లక్షల మంది బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల తరువాత ఈ పథకం అమలుకు వడబోత ప్రారంభించింది. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదని ప్రకటించిన కేంద్రం, ఐదు ఎకరాల నిబంధనను కూడా ఎత్తివేసింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరగాలి. కానీ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు, తదితరులను ఈ పథకం నుంచి తొలగించింది. దీంతో రెండో కిస్తుకు అర్హుల సంఖ్య 33.22 లక్షల మందికే పరిమితమైంది. మొదటి కిస్తు అందుకున్న వారిలో దాదాపు 9.3 లక్షల మంది రెండో కిస్తు సమయానికి అనర్హులుగా మారారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలను కలిపి 12,500 రూపాయలను పెట్టుబడి సాయంగా రైతులను రైతు భరోసా పేరుతో అందించనుంది. రాష్ట్రంలో 54.53 లక్షల మంది రైతులు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుకునేందుకు అర్హులుగా గుర్తించింది. రాష్ట్ర ఖజనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల ఆధారంగా వడపోత నిర్వహించింది. దీంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 2.68 లక్షల మంది, ప్రభుత్వ ఉద్యోగులు 3.14 లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది. దీంతో5.83 లక్షల మందిని ఈ పథకం పరిధి నుంచి మినహాయించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యలో భారీ తేడా ఉంది. మరిన్ని వడబోతలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశం ఉండవచ్చు.