ఆంధ్రప్రదేశ్‌

ట్రాక్టర్‌తో పొలం దున్నిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 13: ఆయన ఓ జిల్లా కలెక్టర్.. అయినా ఆ అధికారం ఏ మాత్రం కనబడదు.. నిత్యం అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ఉత్తేజపరుస్తూ ముందుకెళ్తున్నారు. ఆయన ఎవరోకాదు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్. కలెక్టర్ హోదాను, అధికార దర్పాన్ని పక్కన పెట్టి ఓ సామాన్యునిలా పనిచేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మంగళవారం వ్యవసాయ పనుల్లో భాగంగా ట్రాక్టర్‌తో దున్నారు. బంగ్లాలో ఖాళీగా ఉన్న స్థలంలో అంతర పంటలు పండించేందుకు ఆయనే స్వయంగా ట్రాక్టర్ నడిపి దుక్కి దున్నారు. గతంలో వ్యవసాయ కమిషనర్‌గా పనిచేసిన ఆయనకు వ్యవసాయం అన్నా, మొక్కల పెంపకం అన్నా ప్రీతి. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఆయన పారిస్ సదస్సులో ప్రసంగించి అందరి మన్ననలు అందుకున్న విషయం విదితమే. అంతేగాకుండా పట్టణంలో వాతావరణ ఉష్ణోగ్రతను రెండు డిగ్రీలు తగ్గించేందుకు కోటి మొక్కలు నాటడానికి నడుం బిగించారు. ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. ఈ విధంగా సమాజంలో ఓ మంచి మార్పు తీసుకురావాలని తపన పడుతున్నారు. ఏ చిన్న పని చేయడానికైనా ఆయన హోదాను లెక్క చేయరు. తాను నలుగురితో కలసి పనిచేస్తూ వారిలో ఓ మంచి మార్పు రావాలని కాంక్షిస్తున్నారు. పట్టణంలోని 14 ఎకరాల విస్తీర్ణం కలిగి మురికి కూపంగా మారిన పెద్ద చెరువు శుద్ధి చేసేందుకు నడుం బిగించి అందరి సహకారంతో ఆ చెరువుకు ఒక రూపం తెచ్చిపెట్టారు. ఇదిలా ఉండగా తన బంగ్లాలో ఖాళీ స్థలంలో అంతర పంటలు పండించి ఆ కూరగాయలను ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులకు రూ.10 భోజనం అందించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో తన బంగ్లాలో అంతర పంటలు వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి దున్ని, విత్తనాలు జల్లారు. ఈ విధంగా ఆయన ఓ పక్క జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తూ, మరోపక్క సమాజంలో చైతన్యం కలిగించేందుకు కృషి చేయడం అభినందించదగ్గ విషయమే.

చిత్రాలు.. ట్రాక్టర్‌తో దున్నుతున్న కలెక్టర్ హరి జవహర్‌లాల్, అంతర పంటలకు విత్తనాలు జల్లుతున్న కలెక్టర్