ఆంధ్రప్రదేశ్‌

పోలీసులకు లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 13: జనసేన పార్టీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై మలికిపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి మంగళవారం హైడ్రామా నెలకొంది. తనపై మలికిపురం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మంగళవారం ఉదయం రాజోలు పోలీసు స్టేషనులో లొంగిపోయారు. అనంతరం ఆయనను పోలీసులు రాజోలు కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు స్టేషను బెయిలుపై విడుదల చేశారు.
ఎమ్మెల్యే రాపాకపై నమోదు కేసు వివరాల్లోకి వెళితే... గత ఆదివారం మలికిపురం గ్రామంలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నవారిపై మలికిపురం ఎస్సై కెవి రామారావు దాడి చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక డయాలసిస్ చేయించుకుంటున్న రోగివుండటంతో ఈ విషయం రాజోలు ఎమ్మెల్యే రాపాక దృష్టికి వెళ్లింది. దీనితో అతడిని స్టేషను బెయిలుపై విడుదలచేయాలని ఎమ్మెల్యే రాపాక ఎస్సైను కోరారు. అయితే ఆయన నిరాకరించడంతో రాపాక వెళ్లిపోయారు. తాను వెళ్లిపోయాక స్టేషనులో ఉన్న వారివద్ద తనను ఎస్సై అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి ఎమ్మెల్యే రాపాక ఆందోళనకు దిగారు. ఎస్సై క్షమాపణ చెప్పాలని డిమాండుచేశారు. ఆ సమయంలో పెద్దఎత్తున ఆయన అనుచరులు, జనసేన కార్యకర్తలు స్టేషను వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈసందర్భంగా కొందరు రాళ్లు రువ్వడంతో స్టేషను కిటికీ అద్దం పగిలింది. కాగా రాజోలు సీఐ జోక్యంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే మరికొందరిపై చట్టప్రకారం కేసు నమోదుచేసి, చర్యలు తీసుకుంటామని సోమవారం డీఐజీ, ఎస్పీ ప్రకటించారు. ఈ మేరకు రాపాక మరికొందరిపై 143, 147, 148, 341, 427, 149 సి/33 పిడీపీపీ యాక్టు అండ్ క్రిమినల్ ఎమెండ్‌మెంట్ యాక్టు సెక్షన్ల కింద మలికిపురం పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా మంగళవారం ఏలూరు రేంజి డీఐజీ ఎఎస్ ఖాన్ మలికిపురం స్టేషనుకు వచ్చారు. అలాగే భారీగా పోలీసులను మోహరించడంతో ఎమ్మెల్యే రాపాకను అరెస్టుచేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాపాక, కేసు నమోదైన మరో ఆరుగురితో కలిసి రాజోలు పోలీసు స్టేషనులో లొంగిపోయారు. కాగా స్టేషను బెయిలుపై విడుదలైన అనంతరం ఎమ్మెల్యే రాపాక మీడియాతో మాట్లాడుతూ ఎస్సై తనను అసభ్య పదజాలంతో దూషించినందుకు శాంతియుతంగా ఆందోళన జరిపామని, అయితే గుర్తుతెలియని అరాచకశక్తులు స్టేషన్ అద్దం పగులగొట్టారని, దీనికి పోలీసులు తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, అనుచరులు వేధింపులకు గురికాకూడదనే, తాను స్వచ్ఛందంగా లొంగిపోయానని తెలిపారు. అయితే ఎమ్మెల్యే రాపాక లొంగుబాటు విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో రాజోలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చిత్రం...ఎమ్మెల్యే రాపాకను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు