ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే రాపాకపై కేసు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై కేసును నమోదు చేయడం సరికాదని, చిన్న విషయమే కదా అనుకుంటే చివరకు నాన్ బెయిలబుల్ కేసు వరకు తీసుకెళ్లడం ఆక్షేపణీయమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ సంఘటనపై పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షిస్తున్నామని, రాజోలు వెళదామని అనుకున్నప్పటికీ, ఉన్నతాధికారుల స్పందనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఓ కిడ్నీ పేషెంట్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చిన విషయమై ఓ ప్రజాప్రతినిధిగా అక్కడకు వెళ్లిన శాసనసభ్యుడిని అవమానించడమే కాకుండా నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. అదే అధికార పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌పై దాడిచేసి గాయపరిస్తే కనీసం పోలీసుస్టేషన్‌కు కూడా పిలవలేదని ఆక్షేపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఒక రూలు, మరో పార్టీ ఎమ్మెల్యేకు ఒక రూలా అంటూ పవన్ ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వ సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. జనసేన కార్యకర్తలు, నాయకులు సహనం, సంయమనం పాటించాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.