ఆంధ్రప్రదేశ్‌

వైసీపీకి చుట్టంలా చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 14: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చట్టాన్ని వారి చుట్టంగా మార్చుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ... ప్రతిపక్ష ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన పట్ల ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఆరోపించారు.
ఇదే సమయంలో జమీన్‌రైతు పత్రికా సంపాదకుడిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ప్రత్యక్షంగా దాడిచేసి అంతమొందించేందుకు కుట్రపన్నితే కనీసం అతనిపై కేసు కూడా నమోదు చేయలేదని, అధికార ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 80 రోజుల్లో రాష్టవ్య్రాప్తంగా 470 చోట్ల దాడులకు పాల్పడ్డారని, 172 ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై భౌతికదాడులకు దిగారని, ఆస్తుల ధ్వంసానికి కూడా తెగబడుతున్నారన్నారు. గుంటూరు జిల్లా పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడకడితే కనీసం చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం వ్యవహరించడం సరికాదన్నారు.
మహిళలపై కూడా దాడులు చేస్తూ వివస్తల్రను చేసి మరీ పైశాచికత్వాన్ని చాటుకుంటున్నారన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని పది గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి దౌర్జన్యాలకు దిగుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులైతే మాత్రం వారిపై చర్యలు తీసుకోరా, చట్టం మన రాష్ట్రంలో ఒక చోట ఒక్కోలా ఉంటుందా, లేక పార్టీలను బట్టి మారుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు.