ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాబోర్డుకిచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలని అనుకుంటే తక్షణమే కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, రాయలసీమకు నీళ్లివ్వడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఉమసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ శనివారం తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావుకు బహిరంగ లేఖ రాశారు. వృథాగా సముద్రంలో కలిసే కృష్ణా జలాలను కరవు సీమను ఆదుకునేందుకు వినియోగిస్తుంటే ఆ నీటిని కూడా లెక్కలు వేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. సముద్రంలో వృథాగా పోయే నీటిని శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించిందన్నారు. దానిని సమర్థిచాల్సిన తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తీసుకెళుతున్న నీటిపై ఏపీ ప్రభుత్వం దొంగలెక్కలు చెబుతుందనీ, చర్యలు తీసుకోవాలంటూ కృష్ణానది యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి.. రాయలసీమను రతనాల సీమ చేయడమంటే ఇదేనా అని ఆ లేఖలో రామకృష్ణ ప్రశ్నించారు.