ఆంధ్రప్రదేశ్‌

హై ‘సెక్యూరిటీ’ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: దేశంలో సుదీర్ఘకాలం అత్యున్నత పదవుల్లో పనిచేసి, తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచివున్న నాయకుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోందని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న వ్యక్తి నివాసం వద్ద ఇష్టానుసారం డ్రోన్‌లతో చిత్రీకరిస్తూ, చట్టాలు తెలిసిన వ్యక్తులు సైతం వాటిని ఉల్లంఘిస్తుంటే పరిరక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను ఆయన కార్యాలయంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎఎస్ రామకృష్ణ, అశోక్‌బాబు, మద్దాళి గిరిధర్ తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 16వ తేదీ ఉదయానే్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుమతి లేకుండానే హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి వెళ్లి సెక్యూరిటీ గేట్-1, గేట్-2 సిబ్బందిని ధిక్కరించి లోనికి ప్రవేశించారని పేర్కొన్నారు. ఇది చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని, దీనికి కొనసాగింపుగా అదే రోజు మరో ఇద్దరు యువకులు అక్రమంగా చొరబడి చంద్రబాబు నివాసంపై డ్రోన్‌లను ఎగురవేస్తూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారని తెలిపారు.
అక్కడే ఉన్న తమ నేతలు, కార్యకర్తలు, సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించగా తమ పేర్లు దేవిరెడ్డి వెంకటరెడ్డి, దేవిరెడ్డి సురేంద్రరెడ్డిగా పేర్కొన్నారని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి ఇంట్లో ఉండే కిరణ్ ఆదేశాల మేరకే చంద్రబాబు నివాసాన్ని డ్రోన్‌లతో చిత్రీకరిస్తున్నామని బదులిచ్చినట్లు నేతలు ఐజికి తెలిపారు.
డ్రోన్‌ల ద్వారా వీడియోలు, ఫొటోలు తీయడంపై తమ అనుమతి తీసుకోలేదని జిల్లా అర్బన్ ఎస్‌పి రామకృష్ణ స్పష్టం చేశారని వివరించారు. 2003లో అలిపిరిలో నక్సలైట్ల క్లెమోర్ మైన్ల బ్లాస్టింగ్ దాడిలో వెంట్రుకవాసిలో చంద్రబాబు ప్రాణాపాయం నుండి బయటపడ్డ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయన్నారు. అలాంటిది చంద్రబాబు భద్రతతో చెలగాటం ఆడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీని వెనుక ఉన్న కుట్రదారుల వివరాలను బహిర్గతం చేసి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పదే పదే చంద్రబాబు నివాస ప్రాంతంలో పర్యటించి ఉద్రిక్తతలు పెంచకుండా నిరోధించాలని కోరారు. అక్రమంగా చొరబడ్డ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, డ్రోన్‌లను ఉపయోగించిన ఇరువురు వ్యక్తులను, కిరణ్‌లను తక్షణం అరెస్ట్ చేయాలని ఐజీకి విజ్ఞప్తి చేశారు.
చిత్రం... ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు