ఆంధ్రప్రదేశ్‌

యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 24: రాష్ట్రంలోని వివిధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. చాలాకాలంగా పేరుకుపోయిన బకాయిల చెల్లింపు, సేవల రుసుం పెంచకపోతే శుక్రవారం నుంచి ఈ పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి ఈ విషయమై ప్రకటన చేశారు. ఆసుపత్రుల అసోసియేషన్‌తో చర్చించామని, వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. దీంతో ఆ సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని తెలిపారు. తమ ప్రభుత్వం వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో ఈ పథకం కింద 938 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తుండగా, ఇప్పుడు వాటి సంఖ్యను 1044కు పెంచామని తెలిపారు. వైద్య సేవల పరిమితిని కూడా 2.5 లక్షల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 500 వైద్యులు, 1000 మంది నర్సులను పారదర్శకంగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరికరాల నిర్వహణ బాధ్యతను ఒక సంస్థకు అప్పగించామని తెలిపారు.