ఆంధ్రప్రదేశ్‌

గుంటూరులో కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 18: గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. నాలుగు రోజులుగా చిరుజల్లులకే పరిమితమైన వర్షం ఆదివారం సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా గంటన్నర సేపు ఏకధాటిగా కురవడంతో గుంటూరు నగరంలోని పలు రహదారులు, పల్లపు ప్రాంతాలు, జిల్లాలోని పలు ప్రాంతాలు తటాకాలను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో వస్తుసామగ్రి తడిసిపోయాయి. ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.