రాష్ట్రీయం

కూలిన 62 అడుగుల గణపతి మండపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక (విశాఖ): వచ్చేనెల వినాయకచవితి ఉత్సవాల కోసం నిర్మిస్తున్న భారీ మండపం ఆదివారం వీచిన ఈదురుగాలులు, భారీ వర్షానికి నేలమట్టమైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు కాలేదు. విశాఖకు ఆనుకుని ఉన్న గాజువాక నియోజకవర్గం నాతయ్యపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వచ్చే గణపతి నవరాత్రుల వేడుకలకు సిద్ధం చేస్తున్న 52 అడుగుల భారీ వినాయక విగ్రహంతోపాటు మండపం వీచిన గాలులకు, కురిసిన వర్షానికి కుప్పకూలడంతో నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుగుడు కర్రలతో నిర్మించిన మండపం బలమైన గాలులకు ఊగుతుండడంతో విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పులు కిందకి దిగి బయటకు వచ్చారు. శిల్పులు బయటకు వచ్చిన తరువాత పేక మేడలా సుమారు 65 అడుగులుగల మండపంలోపాటు 52 అడుగుల ఎత్తు గల గణపతి విగ్రహం కుప్ప కూలింది. శిల్పులు మండపం నుండి బయటకు రావడం కారణంగా భారీ ప్రమాదం తప్పింది. పవర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గత 45 రోజుల నుండి 52 అడుగుల భారీ గణనాథుని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సుమారు 65 అడుగల ఎత్తుగల మండపాన్ని సరుగుడు కర్రలతో నిర్మించారు. అయితే వినాయక విగ్రహాంతోపాటు మండపాన్ని నిర్మించేందుకు దాదాపు 15లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే భారీ గణపతిని ప్రతిష్టించేందుకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెల 15వ తేదీన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పూజలు చేయించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఎత్తుగల వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు అందించడంలో గాజువాక ప్రాంతానికి మంచిపేరు ఉంది. ఇప్పటికే విగ్రహం నిర్మాణ పనులు 60శాతం పూర్తయ్యాయి. అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అయితే ఆస్తినష్టం తప్పా ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపరి పీల్చుకున్నారు. పేకమేడలా కూలిన మండపాన్ని తిలకించేందుకు ప్రజలు తరలి వెళ్తున్నారు.