ఆంధ్రప్రదేశ్‌

ఆకతాయి చేష్టలు.. ఆరేళ్ల విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంగనూరు రూరల్, ఆగస్టు 19: బుద్ధిగా చదువుకోమని పాఠశాలకు తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపితే అక్కడ ఆ చిన్నారులు చేసిన ఆకతాయి చేష్టతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన పుంగనూరు పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 14న చిత్తూరు జిల్లా పుంగనూరు తూర్పు మొగసాల ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న హర్షవర్దన్ అనే విద్యార్థి బాత్రూంకు వెళ్లాడు. తోటి విద్యార్థులు ఆ బాలుడ్ని ఆటపట్టించేందుకు బయట గడియ పెట్టి వెళ్లిపోయారు. బాత్రూంలో విద్యార్థి ఉన్న విషయాన్ని వారు మరిచి పోయారు. హర్షవర్దన్ బాత్‌రూంలో కొంత సమయం ఉండి పోయాడు. భయపడి ఎన్నిసార్లు కేకలు వేసినా ఎవరికి వినపడలేదు. కొంత సమయం తరువాత అటుగా వెళుతున్న వంటమనిషి హర్షవర్దన్ ఏడుపు విని గడియ తీసి చూడగా హర్షవర్దన్ ఏడుస్తూ స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. దీంతో హర్షవర్దన్‌ను తల్లిదండ్రులకు అప్పజెప్పింది. మరుసటి రోజు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హర్షవర్దన్ జ్వరంతో హాజరయ్యాడు. జ్వరం ఎక్కువ కావడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెప్పి ఆసుపత్రికి తరలించారు. భయాందోళనకు గురైన హర్షవర్దన్ తీవ్రమైన జ్వరంతో మూడురోజులు పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వరుస సెలవులు ముగియడంతో సోమవారం ఉదయం చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కమిషనర్ లోకేశ్వరవర్మ, ఎస్ ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని హర్షవర్దన్ తల్లిదండ్రులు, బంధువుల ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.
విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహించిన వాలంటర్ ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని, పాఠశాలలో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మరణించిన విద్యార్థి హర్షవర్దన్‌కు ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రద్దాంజలి ఘటించారు.