ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ కురువృద్ధుడు వండువదొర అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరఘట్టం, ఆగస్టు 19: విలువలతో కూడిన నిస్వార్థ రాజకీయాలు నెరపి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ, పలు రాష్టస్థ్రాయి పదవులు నిర్వహించిన విశ్వాసరాయి నరసింహరావుదొర(వండువదొర, 97) సోమవారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నరసింహరావు దొర మృతి చెందడంతో వండువలో విషాదం అలముకుంది. ప్రస్తుత పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి పితృవియోగం కావడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానం
ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి వద్ద సియోలీలో అప్పన్నదొర, రత్నాలమ్మకు వండువదొర 1924లో జన్మించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వండువ గ్రామానికి చెందిన అతని మేనత్త బాడంగి లక్ష్మమ్మ దొరని పెంపకానికి తెచ్చుకోవడంతో వండువలో ఆయన స్థిరపడ్డారు. 1936లో 32వ ఏట వండువ గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయ ఉద్దండులు సర్దార్ గౌతు లచ్చన్న, గొర్లె శ్రీరాములునాయుడు, ఎన్.జి.రంగా, వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడుకు సమకాలికునిగా రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. 1967లో పార్వతీపురం ఎంపీగా స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కొత్తూరు ఎస్టీ నియోజకవర్గానికి 1972లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా 1978లో జనతా పార్టీ తరఫున, 1985లో జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లు విజయం సాధించి ఈ ప్రాంత ప్రజలకు సేవలందించి రాజకీయంగా మంచి పేరు సంపాదించారు. గిరిజన కార్పొరేషన్ చైర్మన్‌గా, డీసీసీబీ చైర్మన్‌గా, వండువ పీఏసీఎస్‌కు 30 ఏళ్లు అధ్యక్షునిగా, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సందర్భాల్లో పార్టీ అధిష్ఠానంతో మధ్యవర్తిత్వం నడిపారు.
విశ్వాసరాయి నరసింహరావుదొరకు శాంతికుమారి, అన్నపూర్ణమ్మ ఇద్దరు భార్యలు. అందులో శాంతికుమారి చివరి కుమార్తె ప్రస్తుతం రెండోసారి పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వాసరాయి కళావతి. వృద్ధాప్యం కారణంగా వండువదొర 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాలు విరమించుకొని ఇంటికే పరిమితమయ్యారు.
వండువదొర మృతి చెందడంతో మంత్రి ధర్మాన కృష్ణదాస్, పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, అధికారులు వండువ గ్రామం చేరుకొని ఎమ్మెల్యే కళావతిని పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్, సీతంపేట ఐటీడీఏ పీవో సాయికాంత్‌వర్మ, ఆర్డీవో కుమార్, డీఎస్పీ రారాజుప్రసాద్, వైసీపీ నేత పాలవలస విక్రాంత్, సీఐ ఆదాం, వివిధ మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను స్వగ్రామం వండువలో నిర్వహించనున్నారు.
వండువదొర (ఫైల్‌ఫొటో)