ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో రెండు పథకాల పేర్లు మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 19: రాష్ట్రంలో రెండు పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో ప్రారంభించిన చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ఇకపై వైఎస్సార్ పెళ్లికానుకగా వ్యవహరించనున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల మహిళలకు బీమా, పింఛనుకు సంబంధించి అమలు చేస్తున్న అన్న అభయహస్తం పథకాన్ని ఇకపై ఇకపై వైఎస్సార్ అభయహస్తంగా వ్యవహరించనున్నారు.
మరో రూ. 305 కోట్ల పనులు రద్దు
రాష్ట్రంలో పంచాయతీ రహదారుల పునఃనిర్మాణ గ్రాంట్ కింద మంజూరై, ఏప్రిల్ 1 వరకూ ప్రారంభించని మరో 650 పనులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి విలువ 305 కోట్ల రూపాయలు ఉంటుంది. కృష్ణా జిల్లాలో 44 పనులు, గుంటూరు జిల్లాలో 575 పనులు రద్దు చేసిన వాటిలో ఉన్నాయి.
గవర్నర్ కార్యదర్శిగా మీనా
గవర్నర్ కార్యదర్శిగా ఎంకే మీనాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీనా ఇప్పటి వరకూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అప్పగించారు. గనుల శాఖ కార్యదర్శిని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను ఐటిఈసీ డైరెక్టర్ ఆర్.పవన్ మూర్తికి అప్పగించారు.
ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులుగా కలెక్టర్లు
2021లో చేపట్టనున్న జనాభ లెక్కల సేకరణకు సంబంధించి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులుగా జిల్లా కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న ప్రారంభమయ్యే ప్రీటెస్టు సెన్సస్‌కు సంబంధించి ఈ నియామకాలు చేసింది. ఆత్మకూరు, భోగాపురం, నరసరావుపేట సెన్సస్ చార్జ్ ఆఫీసర్లుగా అక్కడి తహశీలార్దర్లను నియమించింది.