ఆంధ్రప్రదేశ్‌

ఎకరానికి రూ. 25 వేలు నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 19: వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేలు నష్ట పరిహారం అందించి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామ శివారు సంగళ్లపాలెం వద్ద వరద ముంపు ప్రాంతాల్లో రైతులను, బాధితులను సీపీఐ రాష్ట్ర ప్రతినిధి బృందం పరామర్శించింది. వరద ముంపుకు దెబ్బతిన్న పంటలను ఈ బృందం పరిశీలించింది. బాధిత రైతులను కలుసుకుని ప్రభుత్వం నుండి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణా బ్యారేజీ వద్ద గేట్లు సకాలంలో ఎత్తివేస్తే ఇంత ఉద్ధృత పరిస్థితులు ఉండేవికాదన్నారు. వరదల వల్ల 60 నుంచి 70 వేల ఎకరాల పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీరిలో ఎక్కువ శాతం కౌలు రైతులే ఉన్నారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సంబంధిత అధికారులు సేవాభావంతో పని చేయాలని, అలాంటి దృక్పథంతో చందర్లపాడు తహశీల్దార్ జగన్నాధరావు పనితీరు హర్షణీయమన్నారు. ముంపుకు గురైన గృహాల బాధితులకు ముఖ్యమంత్రి రూ. 5వేలు చొప్పు పరిహారం అందించాలని ప్రకటించారని, కానీ రూ. 10వేలు అందించాలనే డిమాండ్‌తో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో రైతులు, ప్రజల పరిస్థితులు దయనీయంగా మారాయన్నారు. వాణిజ్య పంటలు నీటిలో తేలియాడుతున్నాయని, కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లటంతో రైతులు కన్నీటి పరవంతమయ్యారని అన్నారు. కంద, పసుపు, అరటి, మలబారు పంటలు పండిస్తున్నందున పెట్టుబడి ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని, బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.