ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలానికి మళ్లీ పెరిగిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, ఆగస్టు 20: శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పెరిగింది. దీంతో మంగళవారం రాత్రి ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి 27,891 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద తగ్గడంతో సోమవారం ఉదయం ఐదు గేట్లు మూసిన అధికారులు ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు మూడు గేట్లు మూసివేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక గేటు, మంగళవారం ఉదయం 6 గంటలకు మరోగేటు మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం మాత్రమే దిగువ సాగర్‌కు నీరు విడుదల చేస్తూ వచ్చారు. అయితే మంగళవారం సాయంత్రానికి ఎగువ నుంచి మళ్లీ వరద పెరగడంతో ఒక గేటు పది అడుగుల మేర ఎత్తారు. జూరాల గేట్ల ద్వారా 1,22,756 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 31,532 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 47,159 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,01,447 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుకుంటోంది. ఒక గేటు ద్వారా 27,891 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 30,072 క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 42,378 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 34 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ నుంచి వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.