ఆంధ్రప్రదేశ్‌

పల్లపు ప్రాంతంలో రాజధాని నిర్మాణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 20: ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదతో దిగువన ఉన్న ఎవరి ఇల్లు మునిగినా ఫర్వాలేదని, తన ఇల్లు మాత్రం మునగటానికి వీల్లేదని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆక్షేపించారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు మాత్రమే నిర్ణయిస్తారని మంగళవారం ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి తెలిపారు. డ్యాం, బ్యారేజీల భద్రత వారికి ఎంతో ముఖ్యమన్న ఆయన దిగువన ఉన్న వారి గురించి కూడా ఆలోచించాలన్నారు. అయితే బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్యాలేదు, తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర కథలను చంద్రబాబు తెరపైకి తీసుకు వస్తున్నారని విమర్శించారు. అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించిందన్నారు. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారు అనే విషయంపై కేంద్రం తప్పకుండా ఆరా తీస్తుందన్నారు. దీనిపై ప్రజలు కూడా ప్రశ్నించే సమయం వచ్చిందన్నారు. జవాబు చెప్పలేక బాబు నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారాన్ని టీడీపీ నేతలు మొదలు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు.