రాష్ట్రీయం

బొత్స వ్యాఖ్యలు బాధాకరం: వేదవ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు బాధాకరమని మాజీ ఏపీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదవ్యాస్ మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం చేస్తే వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తుందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు దురదుష్టకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆంధ్ర సమాజాన్ని భయాభ్రాంతుల్ని చేయడమేనని ఆయన గుర్తు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మహనరెడ్డి ప్రభుత్వం అమరావతిని కట్టకూడదన్న అభిప్రాయంతో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. రైతుల భూములు తిరిగి ఇస్తామని మంత్రి చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మనసులో ఉన్నదానినే మంత్రి బొత్స వ్యక్తం చేశారన్నారు. వరదలను భూతద్దంలో చూపించి రాజధాని మునిగిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
2012లో 12 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినప్పటికీ పనిస్థితులు తప్పలేదన్నారు. కేవలం 4,7 టీఎంసీలను కృష్ణా బ్యారేజ్‌లో నిల్వ ఉంచి చంద్రబాబు ఇంటిలోకి వరదనీరు రావడానికి ప్రభుత్వమే కారణమన్నారు. ముంబయికి వరదలు వస్తున్నాయి, యమున నదితో ఢిల్లీకి వరదలు వస్తన్నాయని, అంత మాత్రాన ఆయా రాజధానులను మార్చుతారా అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతిని మార్చాలని చూస్తే ఉద్యమాలు చేయడానికి వెనకాడమన్నారు.