ఆంధ్రప్రదేశ్‌

సానుభూతి కోసమే బాబు తాపత్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 21: ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినప్పటి నుండి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏదో రకంగా ప్రజల సానుభూతి పొందాలని తాపత్రయ పడుతున్నారని, ఈ క్రమంలోనే వరదలను వేదికగా చేసుకుని దిగజారుడు విమర్శలతో సానుభూతి కోసం తాపత్రయ పడుతున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అంబటి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కావాలనే వరదను సృష్టించిందని, జలాశయాలను నింపకుండానే నీటిని వదిలేసిందని, వరద సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని బాబు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు వరదలను ఎవరైనా సృష్టించగలరా అని ప్రశ్నించారు. చెయ్యి నొప్పిగా ఉండటంతో ఇప్పటివరకు పరామర్శలకు రాలేదని బాబు చెప్తున్నారని, చెయ్యి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. వరదలు వస్తే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉండి సహాయం చేయాల్సింది పోయి రాజకీయంగా లబ్ధిపొందాలని చూడటం దురదృష్టకరమన్నారు. నదీగర్భంలో కట్టిన నివాసంలో ఉండటమే తప్పని, ఆ ఇంటిలో ఉంటూ దానిని అధికార పార్టీ వారు ముంచేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్లి ఎలక్ట్రానిక్ జ్యోతిని వెలిగిస్తే హిందూ వ్యతిరేకి ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని, గతంలో సదావర్తి భూములను చంద్రబాబు తాబేదార్లు మింగేయబోతే ఏం చేస్తున్నారని నిలదీశారు. బీజేపీలో చేరుతున్న పచ్చ పుష్పాల పట్ల ఆ పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పచ్చరక్తం ప్రవేశించిన తర్వాత బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ టీడీపీ నేతలు తిరిగి పచ్చవనంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తారని బీజేపీ నేతలు గుర్తుంచుకుంటే మంచిదని అంబటి పేర్కొన్నారు.