ఆంధ్రప్రదేశ్‌

రాజధానిపై సీఎం స్పష్టత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 21: రాష్ట్ర రాజధాని అమరావతిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన రాజధానికి అమరావతి అంత అనువుగా ఉండదని, దీనిపై ప్రభుత్వం త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటుందంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు అయోమయంలో పడ్డారన్నారు. శివరామకృష్ణ కమిషన్ నివేదికలో అమరావతి సురక్షితం కాదని ఉన్నట్లుగా మంత్రి బొత్స చెప్పడం కూడా రాజధాని మార్పునకు వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా అవగతమవుతోందన్నారు. సీఎం జగన్ దేశంలో లేనప్పుడు వ్యూహాత్మకంగా మంత్రి బొత్స సత్యనారాయణ చేత ప్రకటన చేయించారన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే రాజధాని నిర్మాణానికి నిధులివ్వాల్సి ఉందని, అందులో భాగంగానే 1500 కోట్లను విడుదల చేసిందని, ఇంకా 1000 కోట్లు ఇవ్వాల్సి ఉందన్న విషయం గమనార్హమన్నారు.