ఆంధ్రప్రదేశ్‌

పంట నష్టాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: ఇటీవల సంభవించిన కృష్ణా వరదల్లో అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోయిన బాధిత ప్రజలు, బాధిత రైతాంగానికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పంట నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, గత ప్రభుత్వం మాదిరిగా ప్రచారంతో కాలక్షేపం చేయదని, తమది చేతల ప్రభుత్వమని రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు కే పార్థసారథి, కైలే అనికుమార్, కొక్కిలగడ్డ రక్షణనిధి, వ్యవసాయ కమిషనర్ అరుణకుమార్, పలువురు పార్టీ నేతలు, ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు బుధవారం కృష్ణా జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బాధిత రైతులకు, ప్రజలకు అన్ని విధాలుగా సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పొలాల్లో ఇంకా వరద నీరు ఉన్న కారణంగా పంట నష్టాన్ని అంచనా వేయడం కష్టంగా ఉందని, వచ్చే రెండు మూడు రోజుల్లో పంట పొలాల్లో వరద నీరు తగ్గిన తర్వాత అధికారులు పంట నష్టం అంచనా వేసిన తర్వాత తక్షణమే ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. పలు ప్రాంతాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయడం వలనే ఆస్థి, ప్రాణనష్టం లేకుండా పోయిందన్నారు. వరద నిర్వహణలో ప్రభుత్వం చాలా వేగంగా పని చేసిందన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలువాలన్నదే సీఎం జగన్ ధ్యేయమన్నారు. రైతులకు వంద శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు కృత్రిమ వరదను సృష్టించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందుగా రైతుల బాధలు వినకుండా తన ఇంటిని ముంచారనడం సిగ్గుచేటని విమర్శించారు.