ఆంధ్రప్రదేశ్‌

చిదంబరం అరెస్టు గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: కేంద్ర హోం, ఆర్థిక శాఖల మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు ఆయన ఇంటి గోడదూకి అరెస్ట్ చేయడం అత్యంత గర్హనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసీరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆక్షేపించారు. చిదంబరం అరెస్ట్ కావడానికి ముందు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పత్రికల వారితో మాట్లాడారన్నారు. ఈ సందర్భంగా తాను పారిపోలేదని, మంగళవారం రాత్రి మొత్తం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నానని చెప్పడం గమనార్హమన్నారు. ఒక గౌరవనీయ ప్రజాప్రతినిధిని సీబీఐ అధికారులు గోడదూకి అరెస్ట్ చేసిన విధానం కేవలం కక్షపూరితంగా ఉందన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాల ఆశీస్సులతోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొనడం ఎంతవరకు నిజమని తులసీరెడ్డి నిలదీశారు. పోలవరం, పీపీఏల విషయంలో ప్రధాని ఆశీస్సులతోనే తాము ముందుకు వెళుతున్నామని విజయసాయిరెడ్డి చెప్పడంలో ఎంత నిజం ఉందని ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానం, ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.