ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ చీఫ్ మార్షల్‌పై బదిలీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా పని చేస్తున్న వీ. గణేష్‌బాబుపై బదిలీ వేటు పడింది. హైదరాబాద్ నుంచి శాసనసభ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉందని ఆరోపణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆక్టోపస్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పని చేస్తున్న గణేష్‌బాబును గతంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయనను బదిలీ చేసి మంగళగిరిలోని ఆక్టోపస్ ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా గురువారం డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.