ఆంధ్రప్రదేశ్‌

కోడెలపై చట్టపరంగా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: శాసనసభ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సహా అధికారుల ప్రమేయంపై ప్రభుత్వం విచారణ చేయనుందని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కోడెల వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ చాలా విలువైనదన్నారు. ఫర్నిచర్ తీసుకువెళ్లిన వ్యవహారం బయటకు వచ్చాక లేఖలు రాసినట్లు కోడెల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఫర్నిచర్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డీజీపీకి స్పీకర్ తమ్మినేని సీతారాం లేఖ రాశారని గుర్తు చేశారు. కోడెలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసు పెడతామన్నారు. ఫర్నిచర్ తరలింపు వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్లు అసెంబ్లీ చీఫ్ మార్షల్ అంగీకరించటంతోనే ఆయనను బదిలీ చేశారని వెల్లడించారు.