ఆంధ్రప్రదేశ్‌

రాజధాని కట్టాలనే ఆలోచన సీఎంకు ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ ముఖ్యనేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని, ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు నష్టపోవడంతో పాటు, రాష్ట్ర ప్రతిష్ట సైతం మసకబారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు వేర్వేరుగా విలేఖర్ల సమావేశాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం చేపట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఉందా అంటూ ప్రశ్నించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నగరంపై తన వైఖరి ఏమిటో సీఎం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల సంభవించిన కృష్ణా, గోదావరి వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అమరావతి తరలింపు పేరుతో వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారన్నారు. రోడ్లు, భవనాలు నిర్మాణంతో వేలాది మంది కార్మికులతో నిత్యం వచ్చే సందర్శకులతో సందడిగా ఉండే రాజధాని ప్రాంతం వైసీపీ ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల నేడు ఎడారిని తలపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, రాజధాని కేంద్రంగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు, రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేపడుతున్న దుందుడుకు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారన్నారు. ప్రపంచం మెచ్చేలా రాజధాని నగర రూపకల్పనకు సింగపూర్ ప్రభుత్వంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారన్నారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌లను సంప్రదించి అమరావతి నిర్మాణానికి నిధులు వచ్చేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి మోకాలడ్డటం దుర్మార్గమన్నారు.