ఆంధ్రప్రదేశ్‌

ఖజానా చెల్లింపులకు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆగస్టు 22: ప్రభుత్వ ఖజానా నుండి వివిధ శాఖలకు, ఉద్యోగులకు నగదు చెల్లింపులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అన్ని చెల్లింపులు జరిగే సమగ్ర ఆర్థిక యాజమాన్య వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) వెబ్ సైట్‌లో తలెత్తుతున్న పలు సమస్యల కారణంగా చెల్లింపులు నిలిచిపోవటంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించిన బిల్లులను వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు ఇంకా రెండు రోజులు గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్ పని చేయకపోవపడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన నగదు మంజూరులో కూడా ఆలస్యం జరుగుతోంది. పింఛన్లు మంజూరుకు సంబంధించి అనుమతి పత్రాలు చేరినప్పటికీ ఆర్థికంగా రావాల్సిన నిధులు మాత్రం ఇంత వరకు వారికి చేరలేదు. అలాగే పలు శాఖల్లో వివిధ రకాల పనులు చేసిన కాంట్రాక్టర్లకు నగదు చెల్లింపులు కూడా ఆగిపోవడంతో వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తి అయినప్పటికీ బిల్లుల చెల్లింపులో ఆలస్యం కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్ పని చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి రాబడులు తక్కువగా.. చెల్లింపులు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో నగదు సర్దుబాటు కోసం కొంచెం సమయం తీసుకుంటున్నారేమో అని పలువురు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన డీడీవోలు, సీఎంఎఫ్‌ఎస్ అధికారులు వేలి ముద్రల సహాయంతో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా పంపించిన బిల్లులను ఖజానాశాఖ అధికారులు పూర్తిగా పరిశీలించి, చెల్లింపుల కోసం ఈ- కుబేర్‌కు పంపుతారు. ఈ- కుబేర్ నుండే నగదు ఆయా డీడీవోలు, ఉద్యోగులు, వ్యక్తులు, కాంట్రాక్టర్లకు చేరుతుంది. అయితే ప్రస్తుతం బిల్లులకు సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేసేందుకు సీఎఫ్‌ఎంఎస్ వెబ్‌సైట్ పని చేయకపోవడంతో చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. కొత్త చెల్లింపులకు సంబంధించిన వివరాలు నమోదు చేయడం కూడా సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాల చెల్లింపు వివరాలను నమోదు ప్రక్రియకు తీవ్ర ఆటకం కలిగింది.