ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’పై తీర్పు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తొందరపాటు నిర్ణయానికి తాజాగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టుగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మరో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఉమా మాట్లాడారు. 2009లో తండ్రి చేసిన తప్పునే తిరిగి 2019లో తనయుడు పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో దక్కించుకోలేక పోయిన పవర్ ప్రాజెక్టును ఎలాగైనా తిరిగి కొట్టాయాలన్నదే జగన్ ఎత్తుగడ అని, వైఎస్ బంధువు పీటర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన నివేదిక అంతా తప్పులతడకేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందన్నారు. చంద్రబాబు హయాంలో నిర్విరామంగా సాగిన పోలవరం ప్రాజెక్టు పనులు వైసీపీ నేతల పుణ్యమా అని ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్రప్రభుత్వం చెప్పినా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దంటున్నా వినకుండా ఏకపక్షంగా ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకుంటే మంచిదని సూచించారు. పోలవరం పనులను వేగంగా చేస్తున్న నవయుగ కంపెనీని కాదని ఇష్టానుసారంగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఎద్దేవాచేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ రాష్ట్భ్రావృద్ధిని కాంక్షించేదిగా లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషి చేసిందన్నారు.
లేని అవినీతిని చంద్రబాబుపై రుద్దాలన్న ఏకైక ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని స్పష్టంచేశారు. హైకోర్టు తీర్పుతోనైనా ముఖ్యమంత్రి జగన్ కళ్లు తెరవాలని సూచించారు. తన విధానాల ద్వారా సమాజానికి జగన్ నష్టం చేకూరుస్తున్నారని కోర్టు తీర్పు ద్వారా మరోసారి స్పష్టమవుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, దీనిపై ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామని ఆలపాటి రాజా పేర్కొన్నారు.