ఆంధ్రప్రదేశ్‌

జ్యోతి సురేఖకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: నెదర్లాండ్స్‌లో ఇటీవల జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో వ్యక్తిగత, జట్టు విభాగంలో కాంస్య పతకం సాధించిన వీ. జ్యోతి సురేఖను రాష్ట్ర మంత్రులు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమెను మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, కొడాలి నాని, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సన్మానించారు. క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. క్రీడల్లోనూ, చదువులోనూ రాణిస్తున్న జ్యోతిని అభినందించారు.

చిత్రం... జ్యోతి సురేఖను సత్కరిస్తున్న కొడాలి నాని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, పేర్ని నాని