ఆంధ్రప్రదేశ్‌

నవరత్నాలపై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టీ విజయకుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం విజయవాడలోని సమాచారశాఖ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్‌ఓలు, జోనల్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అధికారులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ముఖ్య కార్యక్రమాల ప్రచారంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం కలిగి డేటాను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవ ప్రజాభిప్రాయాన్ని, విజయగాథలను సేకరించి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. సమాచారశాఖ అధికారులు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. సమాచార శాఖ అధికారులు, సిబ్బంది ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటి వారని, వారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అక్రిడిటేషన్లకు సంబంధించి కొత్త జీఓను రూపొందిస్తున్నామని దాని ప్రకారం త్వరలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సేకరించి అక్రిడిటేషన్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఓ వీఆర్‌ఓ, ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌లను త్వరలో కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సంచాలకులు డీ శ్రీనివాస్, సంయక్త సంచాలకులు పీ కిరణ్‌కుమార్, ఎల్ స్వర్ణలత, వెంకటేష్, బాల గంగాధర్ తిలక్, లాల్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి