ఆంధ్రప్రదేశ్‌

వెనకడుగు వేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని రాష్ట్ర మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టు ఉత్తర్వులు తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని, అక్రమాలు నివారించి ప్రభుత్వ ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. బంధువులకే పోలవరం పనులు దక్కాయన్న విధంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వ విధానాలను ఎక్కడా హైకోర్టు తప్పుపట్టలేదని గుర్తుచేశారు. రాజధాని అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. పార్టీలో జరుగుతున్న చర్చనే వెల్లడించారన్నారు. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్చ జరగాలన్నదే తమ అభిప్రాయమన్నారు. రాజధానిని మార్చే ఆలోచన లేదని, రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై మంత్రి వర్గ ఉపసంఘం విచారిస్తోందని, నివేదికలు అందాక అక్రమార్కులపై చర్యలు ఉంటాయన్నారు.
చిత్రం... రాష్ట్ర మంత్రి కొడాలి నాని