ఆంధ్రప్రదేశ్‌

మొట్టమొదటి సీఎం కప్ విజేతలు విశాఖ, కృష్ణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 23: మొట్టమొదటి సీఎం కప్ వాలీబాల్ విజేతలుగా విశాఖపట్నం (పురుషులు), కృష్ణా (మహిళలు) జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో కృష్ణా జిల్లా జట్టుతో విశాఖపట్నం తలపడి (3-1) 23-25, 25-21, 25-16, 25-18 స్కోరుతో విశాఖపట్నం విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో కృష్ణా జట్టు విశాఖపట్నంతో పోటీ తలపడి (3-2), 25-21, 21-25, 17-25, 25-20, 15-13 స్కోరుతో విజేతగా నిలిచింది. రన్నర్స్‌గా కృష్ణా(పురుషులు), విశాఖపట్నం (మహిళలు) నిలవగా, మూడో స్థానంలో విజయనగరం (పురుషులు), కర్నూలు (మహిళలు), నాలుగో స్థానంలో పశ్చిమగోదావరి (పురుషులు), ప్రకాశం (మహిళలు) నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ క్రీడాకారులు చక్కగా సహకరించడంతొ తొలిసారిగా శ్రీకాకుళంలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించగలిగామన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తే ప్రపంచంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఈ సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్‌ను పక్కాగా నిర్వహించిన కలెక్టర్ నివాస్‌ను మంత్రి అభినందించారు. అనంతరం విజేతలకు షీల్డ్‌లను అందచేశారు. కలెక్టర్ జనార్దన్ నివాస్, రాష్ట్ర వాలీబాల్ సంఘం అధ్యక్షుడు పీవీజీఆర్ నాయుడు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణారావు, జిల్లా ఒలింపిక్స్ సంఘం కార్యదర్శి పి.సుందరరావుతదితరులు పాల్గొన్నారు.

చిత్రం...సీఎం కప్ వాలీబాల్ విజేతలుగా నిలిచిన విశాఖ పురుషులు, కృష్ణా జిల్లా మహిళల జట్లు