ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి చిల్లర నాణేలు బ్యాంకర్లకు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 22: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే సామాన్య భక్తులు హుండీలో సమర్పించుకున్న చిల్లర నాణేలు మార్పిడికి సంబంధించి టీటీడీ యాజమాన్యంలో గత ఎంతో కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. గత కొంతకాలంగా 20 కోట్లకు పైబడి నిలవ ఉన్న నాణేల్లో గురువారం 5.15 కోట్ల రూపాయల విలువ చేసే నాణేలను స్వీకరించడానికి బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. మొత్తం మీద ధర్మారెడ్డి బ్యాంకర్లకు ఇచ్చిన సూచనలు ఆదేశాలు మరో ఆరు నెలల వ్యవధిలో 20 కోట్ల రూపాయలు స్వామివారి ఖాతాలో కరెన్సీ రూపంలో జమ కానున్నాయి. ఇదిలావుండగా గురువారం 8 కోట్లకు పైగా శ్రీవారికి ఆదాయం లభించినట్టు మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఇందులో కరెన్సీ రూపంలో గురువారం నాటికి 3.43 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం లభించింది. నిల్వ ఉండిపోయిన నాణేలు 5.15 కోట్ల రూపాయలు కలిపితే 8 కోట్ల 58 లక్షల 50 వేల రూపాయలు గురువారం నాటి ఆదాయంగా గణించడం జరిగింది.