ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారం కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 22: ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారాలు ఉన్నట్లు వెలుగుచూసిన సంఘటన తిరుమలలో కలకలం సృష్టించింది. తిరుమలలో ఆర్టీసీ టిక్కెట్ల వెనుకభాగాన అన్యమతం ప్రచారం ఉన్నట్లు కొంతమంది మీడియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సాక్షాత్ ప్రభుత్వ సంస్థగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అన్యమతం ప్రచారం చేయటం ఏమిటని విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరోక్షంగా ఇలాంటి ప్రచారం చేయిస్తుందని ఆరోపణలు వినవచ్చాయి. అయితే ఇది పొరపాటుగా జరిగిన అంశం అని, ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై మాజీ ధర్మకర్త మండలి సభ్యుడు ఓవి రమణ మాట్లాడుతూ తిరుమల తిరుపతి బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత యాత్రల గురించి ప్రచారం చేయడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆలయ పవిత్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌గా నియమితులైన సుబ్బారెడ్డి అన్యమతస్తులు కావడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. పాలకమండలి రద్దు చేసి రెండు నెలలు అయినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేయకపోవడం టీటీడీ చరిత్రలో తొలిసారి అని ఆయన అన్నారు.