ఆంధ్రప్రదేశ్‌

అన్యమత ప్రచారం గత ప్రభుత్వ పాపమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 23: ఆర్టీసీ టికెట్ల రూపంలో తిరుమలలో జరుగుతున్న అన్యమత ప్రచారం గత ప్రభుత్వ పాపమేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నం దేశాయిపేటలోని గో సంఘంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఆయన తిరుమలలో అన్యమత ప్రచారంపై స్పందించారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ టికెట్ల ద్వారా జరుగుతున్న అన్యమత ప్రచారానికి, తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. గడిచిన నాలుగేళ్లుగా ఇంత మందిని జెరూసలెం, మక్కా పంపించామంటూ ఆర్టీసీ టికెట్లపై ముద్రించారన్నారు. తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తోందని, అలాంటప్పుడు అది తమ ప్రభుత్వం చేసిన ప్రచారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు గత టీడీపీ ప్రభుత్వం మైనార్టీ వెల్ఫేర్ శాఖ ద్వారా ఈ టికెట్ రోల్స్‌ను ముద్రించి రాయలసీమలోని నాలుగు జిల్లాలు, చిత్తూరు, తిరుపతికి సరఫరా చేశారన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే టికెట్ రోల్స్‌ను స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. పాత ప్రభుత్వం సరఫరా చేసిన టికెట్ రోల్స్‌ను వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు టీడీపీ, బీజేపీలు తమ ప్రభుత్వాన్ని నిందించేలా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా.. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. అనే విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.