ఆంధ్రప్రదేశ్‌

సమర్థ నీటి నిర్వహణ చేతకాని పాలకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఆగస్టు 24: గత ఐదేళ్లలో సమర్థ నీటి నిర్వహణ కారణంగానే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అవార్డుల పంట పండిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
నాడు వచ్చిన విపత్తులను ముందుగానే పసిగట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు, శరవేగంగా సహాయక చర్యలు తీసుకున్న కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని శనివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కానీ నేటి వైసీపీ ప్రభుత్వం నీటి నిర్వహణలో చూపిన అలసత్యం, అసమర్థత వల్లనే రాష్ట్రానికి కృత్రిమ వరదలు వచ్చాయని ఆరోపించారు. నీరు - చెట్టు కార్యక్రమంపై అవగాహన లేని వైసీపీ నాయకులంతా నానారకాలుగా మాట్లాడుతున్నారని, నాడు ఈ కార్యక్రమాన్ని దేశమంతా ప్రశంసించిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తమ పాలనలో సమర్థ నీటి నిర్వహణ వల్ల నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో రాష్ట్రానికి రెండో ర్యాంకు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. కేవలం ఒక పాయింట్ దూరంలోనే మొదటి ర్యాంకు పోయిందని, లేనిపక్షంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉండేదన్నారు. గడిచిన మొడు నెలల వ్యవధిలో కృష్ణా, గోదావరి వరదల్లో 4 జిల్లాల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన పంటనష్టం, ఆస్తినష్టం జరగడం బాధాకరమన్నారు. నీటి నిర్వహణలో ప్రభుత్వ అసమర్థత వల్లనే ఇదంతా జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం, వైసీపీ పాలనకు మధ్య తేడాను గుర్తించారన్నారు. విపత్తు నిర్వహణ చేతకాకపోతే ఇక ప్రభుత్వాలెందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హుదూద్ తుఫాన్ సమయంలో 240 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఈదురుగాలులు, భారీ వర్షాలకు విశాఖ వణికిపోయిందని, తిత్లీ తుఫాన్‌లో 180 కిలోమీటర్ల వేగం గాలులు, భారీ వర్షాలకు శ్రీకాకుళం అల్లాడిందన్నారు. నాడు ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం నష్టాలను నివారించగలిగిందన్నారు. గంటల వ్యవధిలోనే పునరావాస, సహాయ చర్యలతో బాధితులను ఆదుకున్నామన్నారు. వేలాది మందికి ప్రతిరోజూ భోజనాలు, నాణ్యమైన నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. నేలకూలిన లక్షలాది చెట్లను తొలగించడంతో పాటు విరిగిపడిన వేలాది కరెంటు స్తంభాలను త్వరితగతిన పునరుద్ధరించామన్నారు. అప్పటి స్ఫూర్తి ఇప్పటి కృష్ణా, గోదావరి వరదల్లో ఏమైందని ఆయన ప్రశ్నించారు. నేటి ప్రభుత్వ అసమర్థత రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని ట్విట్టర్‌లో చంద్రబాబు ధ్వజమెత్తారు.
తప్పు చేస్తే శిక్షకు ఓకే.. కక్ష సాధిస్తే ఊరుకోం
తప్పుచేస్తే ఎలాంటి శిక్షకైనా సమర్థిస్తామని, కానీ పనిగట్టుకుని కక్షసాధిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన సొంతింటికి తరలించారనే అంశానికి సంబంధించి శనివారం ఆయన స్పందించారు. కోడెల శివప్రసాదరావు తప్పు చేసినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, కానీ కక్షసాధింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. తప్పు జరిగినప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకోడానికి తమ పార్టీ అడ్డుపడదన్నారు. కానీ ప్రభుత్వం వాస్తవాలను పూర్తిగా విచారించాకే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.