ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ప్రాజెక్టు కేంద్రమే నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందని, సీఎంగా జగన్ వింత ధోరణితో ముందుకు సాగుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి మొత్తం తన కనుసన్నల్లో జరగాలని ఆయన మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము కనుసైగ చేస్తే ప్రజల జీవితం సాగాలి, లేకుంటే ఆగిపోవాలనే విధంగా జగన్ పాలన ఉందని విమర్శించారు. గతంలో వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి అమలు చేసిన పథకాలను చంద్రబాబు మరింతగా ముందుకు తీసుకెళ్లారని, ఇప్పుడు జగన్ మాత్రం చంద్రబాబు ప్రవేశపెట్టారనే కారణంతో పలు పథకాలు నిలిపివేశారని విమర్శించారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిధులిచ్చినా అత్యంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ పనులను నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టామన్నారు. 73శాతం నిర్మాణం పూర్తి చేశామని, తామెక్కడా నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. పోలవరం నిర్మాణం ఆలస్యమైతే సంవత్సరానికి రూ. 300కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని ప్రాజెక్టు అథారిటీ సీఈవో కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. కేంద్రం నిధులు కనుక జగన్ వ్యవహారం తేడాగా ఉందని, కేంద్రమే పోలవరం నిర్మాణం చేపట్టాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నట్లు సోమిరెడ్డి వివరించారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి