ఆంధ్రప్రదేశ్‌

నీటి ఎద్దడికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: రాష్ట్రంలో అప్పుడే వేసవికాలం సమీపించినందున ప్రజలెవ్వరూ మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుబాటులోవున్న నీటిని సమర్ధవంతంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక జలవనరులశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో మంచినీటి అవసరాల కోసం ఎంతో ప్రయాసతో శ్రీశైలం నుంచి రెండు టిసిఎంల నీటిని విడుదల చేయగా ఉద్ధృతమైన ఎండలకు ఆవిరైపోగా కేవలం ఒక్క టిఎంసి నీరు మాత్రమే ప్రకాశం బ్యారేజీకి చేరిందన్నారు. జిల్లాలోని మెట్టప్రాంత చెరువులకు మంచినీటిని మళ్లించేందుకు గాను నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి తెలంగాణ రాష్ట్రం నల్గొండ, ఖమ్మం జిల్లాలను దాటి మంచినీటిని తెచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న 2 టిఎంసిల నీటికి అదనంగా మరో 2 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సిందిగా కృష్ణానది నిర్వహణా బోర్డుకు నివేదించామన్నారు. ఈ బోర్డు వారం రోజుల్లో సమావేశమవుతుందని పరిస్థితిని సమీక్షించి తగు చర్యలు తీసుకోగలదన్నారు. అవసరమైనచోట నీటి రవాణా చేసైనా మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించటం జరిగిందన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు మంచినీటిని అందించేందుకు మరో 4.5 టిఎంసిల నీటిని కృష్ణానది నిర్వహణ బోర్డు విడుదల చేయటం జరిగిందన్నారు. అలాగే విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వంశధార, నాగావళిలో ప్రస్తుతమున్న నీటి నిల్వలను ఆయా జిల్లాల్లో మంచినీటికి వినియోగిస్తున్నామన్నారు. ఏలేరు జలాశయం నుంచి ఒక టిఎంసి నీటిని విశాఖ నగర మంచినీటి అవసరాలకు విడుదల చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తిచేయటం ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు వర్షపు నీటిని మళ్లించి తాగునీటి అవసరాలకు వినియోగించే చర్యలు చేపడతామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి రాళ్లపాడు ప్రాజెక్టులో నీళ్లను మంచినీటి అవసరాలకు వినియోగిస్తామన్నారు. ఇందుకు సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని నెల్లూరు జిల్లా ప్రజల మంచినీటి అవసరాలకు వినియోగిస్తామన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాలకు మంచినీటి అవసరాలను తీర్చేందుకు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువుల్లో చేరిన నీటిని సమర్ధవంతంగా మంచినీటి అవసరాలకు వినియోగిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాకు హంద్రీ-నీవా, తుంగభద్ర జలాశయాల నీటిని కూడా వినియోగిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో డోన్, పత్తికొండలోని కొంతవరకు మంచినీరు, సాగునీటిని అందించగలుగుతున్నామన్నారు.