ఆంధ్రప్రదేశ్‌

అక్రమ కేసులు, వేధింపుల వల్లే కోడెలకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 24: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వేధింపులు, అక్రమ కేసుల వల్లనే అస్వస్థతకు గురయ్యారని, దీనికి వైసీపీ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం నగరంలోని శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడెలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఇతర నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా ఆనందబాబు విలేఖరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు తీవ్రం కావటం వల్లే కోడెల ఆరోగ్యం క్షీణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా గ్రామాలను విడిచి వెళ్లాలని హెచ్చరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
నిలకడగా కోడెల ఆరోగ్యం
శుక్రవారం అస్వస్థతకు గురై గుంటూరులో చికిత్స పొందుతున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు, పార్టీ వర్గాలు తెలిపాయి. కోడెలను పలువురు పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబు చేశారు.