ఆంధ్రప్రదేశ్‌

బోటు కూడా తీయలేని చేతగాని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఆగస్టు 24: రాష్ట్ర ప్రజల రక్షణలో వందకు వంద శాతం విఫలమైన ప్రభుత్వం మంత్రి సాక్షిగా అమాయకుడి ప్రాణాన్ని బలిగొందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున బోటును కూడా తొలగించలేని చేతగాని స్థితిలో ప్రభుత్వం ఉందని శనివారం ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. బ్యారేజీ గేటుకి అడ్డంగా ఉన్న చిన్న బోటు తియ్యలేని చేతగాని ప్రభుత్వం, శనివారం మంత్రి సాక్షిగా ఒక అమాయకుడి ప్రాణాన్ని మింగేసిందన్నారు.
ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి మరీ ఇంత చులకనేమిటని ప్రశ్నించారు. గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని కూడా తెలీదా? ఏమిటీ అహంకారం, ఎందుకీ నిర్లక్ష్యమంటూ నిలదీశారు. మంత్రి సమక్షంలోనే ఇలా జరిగితే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి తక్షణం న్యాయం చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.